Mobile Popup Ad
Mobile Popup Ad

డైరెక్టర్‌గా రామ్ పోతినేని.. ‘RAPO23’ బిగ్ అప్‌డేట్

కలం, సినిమా : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తన సినీ కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. నటుడిగా ప్రేక్షకులను అలరించిన రామ్, ఇప్పుడు దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ‘RAPO23’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం జూన్ 29న జరగనున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్‌లో “The Story of a Lone Wolf”అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను రామ్ పోతినేని స్వయంగా నిర్వహించనుండగా, నిర్మాతగా ఆయన సోదరుడు కృష్ణ పోతినేని వ్యవహరించనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్ (RAPO23) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడిగా రామ్ పోతినేని ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో, నటుడిగా ఆయనకు ఈ సినిమా కమర్షియల్ బ్రేక్ ఇస్తుందా అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. పూజా కార్యక్రమం అనంతరం నటీనటులు, సాంకేతిక బృందం, షూటింగ్ షెడ్యూల్ తదితర వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ‘RAPO23’తో రామ్ పోతినేని కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>