కలం, సినిమా : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) అమెరికా వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో (US Consulate Hyderabad) తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీసా ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని, ప్రక్రియ క్లిష్టంగా ఉంటుందని భావించినట్లు ఆయన తెలిపారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని.. కొత్త కాన్సులేట్ భవనాన్ని సందర్శించే అవకాశం, సిబ్బందితో ఆసక్తికరమైన సంభాషణలు, వేడి కాపుచినోతో పాటు అక్కడి సిబ్బంది చూపిన ఆతిథ్యం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.
“ఆ ప్రదేశం ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా ఎంతో ఆత్మీయంగా అనిపించింది. నేను వెళ్లిన అసలు కారణం కంటే, ఊహించని ఆతిథ్యమే నాకు మరపురాని అనుభూతిని ఇచ్చింది. ఈ ఆతిథ్యానికి అమెరికా కాన్సులేట్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: కాక రేపుతోన్న వరంగల్ రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మంత్రి ‘చిన్నపులి’ కామెంట్స్!
Follow Us On : WhatsApp

