సిగ్నల్ సమస్య.. నిర్మల్ జిల్లాలో నిలిచిన బియ్యం పంపిణీ

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో చౌకధరల దుకాణాల్లో సిగ్నల్ సమస్య కారణంగా రేషన్ పంపిణీకి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గత నాలుగు రోజులుగా నెట్‌వర్క్ సరిగా అందక ఈ-పాస్ (ఈ-పీఓఎస్) యంత్రాలు పనిచేయడం లేదు. లబ్ధిదారుల వేలిముద్రలు నమోదు కాకపోవడంతో బియ్యం పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో ప్రజలు గంటల తరబడి దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో ప్రతి నెల మాదిరిగానే రేషన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి వేలిముద్రలు నమోదు కాకపోతే పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. రేషన్ పంపిణీకి ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సాంకేతిక సమస్యలు కొనసాగితే అర్హులైన కుటుంబాలు రేషన్ పొందకుండా మిగిలిపోతామేమోనన్న భయం వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు కూడా నెట్‌వర్క్ సమస్య వల్ల పంపిణీ చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. సిగ్నల్ అందిన వెంటనే పంపిణీ చేస్తున్నప్పటికీ మళ్లీ నెట్‌వర్క్ నిలిచిపోవడంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతోందని అంటున్నారు.

సమస్యకు తక్షణ పరిష్కారం కోరుతున్న ప్రజలు

సిగ్నల్ సమస్యను వెంటనే పరిష్కరించి ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ విధానంలో రేషన్ పంపిణీ చేపట్టి ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నష్టపోకుండా చూడాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. 15వ తేదీ గడువును కూడా అవసరమైతే పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: కాక రేపుతోన్న వరంగల్ రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మంత్రి ‘చిన్నపులి’ కామెంట్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>