వరంగల్‌లో అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష

కలం, వరంగల్ బ్యూరో: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న (Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ, వరంగల్ (Warangal) ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్‌పై నిర్మిస్తున్న ఫుడ్ స్ట్రీట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. హనుమకొండ బస్టాండ్‌లో నెలకొన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

ఏనుమాముల మార్కెట్ సమీపంలోని బాలాజీ జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. గోవిందరాజులగుట్టలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ ఆటోను తనిఖీ చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరణ జరిగేలా శానిటరీ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ సంజయ్ కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>