రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి.. పొన్నం దిగ్భ్రాంతి

కలం, కరీంనగర్: సిద్దిపేట – హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదమని, వారి మృతి పట్ల మంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదం (Husnabad Road Accident)లో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడు శ్రీహాన్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.

మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కోరారు. రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని మంత్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>