కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా ఓ భారీ ఈవెంట్‌కు మేకర్స్ సిద్దమయ్యారు. ‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్ ఈవెంట్‌ను మే 18న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా హాజరవుతారని మేకర్స్ అంచనా వేశారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనుండటంతో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ప్రముఖ నటీనటులు, టెక్నికల్ టీమ్ సభ్యులు పాల్గొననున్నారు. ‘పెద్ది పవర్ ప్లే టూర్’ లో భాగంగా మరిన్ని భారీ ఈవెంట్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది.
Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్
Follow Us On: Instagram

