కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది'(PEDDI). భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్ ప్రోమోను నేడు (మే 22) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
దర్శకుడు బుచ్చిబాబు సనా సోషల్ మీడియాలో “ఈరోజే హెల్లల్లల్లో ప్రోమో.. సిద్దంగా ఉండండి” అంటూ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులలో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ పోస్టుకు డ్యాన్స్ ఎమోజీలు జత చేయడంతో ఇది మాస్ బీట్ సాంగ్ అయి ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘హెల్లల్లల్లో’ సాంగ్ ప్రోమోపై కూడా భారీ హైప్ ఏర్పడింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ కానుండటంతో మూవీ టీం ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత క్రేజ్ పెంచుతుంది.

