కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) .. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా రన్‌టైమ్ కారణంగా తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలను తిరిగి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బుధవారం నుంచి ప్రదర్శించే వెర్షన్‌లో హీరోయిన్‌కు సంబంధించిన రెండు సన్నివేశాలు, నటుడు జగపతి బాబుకు సంబంధించిన మరో రెండు కీలక సన్నివేశాలు జోడించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సీన్‌లు కథలో భావోద్వేగాలను మరింత బలంగా చూపిస్తాయని చెప్పారు. ఇప్పటికే సినిమాలో కొన్ని భాగాలు ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చిందని, ముఖ్యంగా జగపతి బాబు పాత్రకు సంబంధించిన కొన్ని పవర్‌ఫుల్ మూమెంట్స్ ప్రేక్షకులు మిస్ అయ్యారని బుచ్చిబాబు గత ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పుడు వాటిలో ఎంపిక చేసిన సన్నివేశాలను థియేటర్లలో తిరిగి చేర్చడం అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది. కొత్త సీన్లతో ‘పెద్ది’ మరింత ప్రభావవంతంగా మారుతుందని, ముఖ్యంగా ఎమోషనల్ ట్రాక్‌కు అదనపు బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు బుధవారం నుంచి మరోసారి థియేటర్లకు క్యూ కట్టనున్నారు.

