నాంపల్లి కోర్టుకు డిప్యూటీ సీఎం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. గతంలో ఆయనపై నమోదైన ఒక పాత కేసు విచారణలో భాగంగా ఈరోజు ఆయన న్యాయస్థానం ముందుకు వచ్చారు.

2022 ఏప్రిల్ 1వ తేదీన కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నియమాలు ఉల్లంఘించి మీడియా సమావేశం నిర్వహించారనే ఆరోపణలపై స్థానిక కొత్తగూడెం పోలీసులు అప్పట్లో భట్టివిక్రమార్కపై కేసు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుండటంతో ఆయన స్వయంగా కోర్టుకు హాజరై తన వివరణను సమర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>