Mobile Popup Ad
Mobile Popup Ad

బల్క్ ఆర్డర్ పేరిట స్వీట్ షాప్ ఓనర్‌కి టోకరా.. స్కూటీతో ఉడాయించిన కేటుగాడు

కలం, హనుమకొండ: ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యాపారి బలహీనతను ఆసరాగా చేసుకున్న దొంగ ఎంతో చాకచక్యంగా అతడి స్కూటీతో ఉడాయించిన ఘటన హనుమకొండ (Hanumakonda) జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

​అసలేం జరిగింది ..?

​హనుమకొండ జిల్లా కేంద్రం నక్కలగుట్టలోని ఒక స్వీట్ షాప్ నడిపిస్తున్న యజమానిని ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. మీ షాప్ కి దగ్గరలోనే నాకు ఆఫీస్ ఉందని, ప్రతిరోజూ 250 కప్పుల టీ సరఫరా చేయాలంటూ ఒక పెద్ద ఆర్డర్ ఆశ చూపించాడు. ఆ వ్యక్తి మాటలు వాస్తవమే అని నమ్మిన స్వీట్ షాప్ యజమాని డీల్ ఓకే చేసుకున్నాడు. ​తీరా ఆర్డర్ ఖరారయ్యాక, “మా ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తాను రండి” అంటూ సదరు వ్యక్తి నమ్మబలికాడు. దీంతో ఆ యజమాని తన స్కూటీని సదరు వ్యక్తికి ఇచ్చి భార్య, కుమారుడిని ఆఫీస్ చూసి రమ్మని పంపించాడు.

స్కూటీతో జంప్..!

స్వీట్ షాప్ యజమాని భార్యాపిల్లలను స్కూటీపై ఎక్కించుకెళ్లిన ఆ మాయగాడు ముందే సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం వారిద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో దించేశాడు. ఆ తర్వాత ఆఫీస్ చూపించకుండా, యజమానికి సంబంధించిన స్కూటీతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఎంతసేపటికీ అపరిచితుడు రాకపోవడంతో అటు భార్యాపిల్లలు వేర్వేరు చోట్ల ఉండిపోయారన్న విషయం తెలుసుకున్న స్వీట్ షాప్ ఓనర్ మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.​ ఈ మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటివి ఫుటేజీల ఆధారంగా స్కూటీ చోరీ చేసిన మాయగాడి కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>