కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. వర్షాల రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, హనుమకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) మండల కేంద్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక వరి పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళలు తమ ఆనందాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
పొలంలో నాట్లు వేస్తూనే, జానపద పాటలు పాడుతూ, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతూ వైరల్గా మారింది. వానల రాకను స్వాగతిస్తూ వారు చేసిన నృత్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
VIRAL VIDEO: వరి నాట్లు వేస్తూ మహిళలు డాన్స్
-హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వర్షాల రాకతో రైతులు హర్షం వ్యక్తం
-వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పొలంలో నాట్లు వేస్తూ.. జానపద పాటలు పాడుతూ, ఉత్సాహంగా నృత్యాలు చేసిన మహిళలు
Warangal Rains Unleash Joy: Women Dance in Muddy Paddy… pic.twitter.com/s0PrG239ca— Kalam Daily (@kalamtelugu) July 30, 2026
Read Also: నాంపల్లి కోర్టుకు డిప్యూటీ సీఎం!
Follow Us On : WhatsApp

