గోదావరి ఉగ్రరూపం.. మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

కలం, భూపాలపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ (Medigadda Barrage) వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో అవసరానికి అనుగుణంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

Read Also: నామినేటెడ్ పదవులేవీ?.. కాంగ్రెస్‌ క్యాడర్ నిరాశ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>