కలం, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు వస్తున్న వార్తలతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో గాయంపై చరణ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. “చరణ్ గారి కంటికి ఏమీ కాలేదు. దెబ్బ కంటి పైన (కనుబొమ్మ పక్కన) తగిలింది. దానికి నాలుగు కుట్లు పడ్డాయి. కన్ను మాత్రం చాలా క్షేమంగా ఉంది. ఎవరూ భయపడాల్సిన పనిలేదు” అని వెల్లడించింది.
చరణ్ గాయంపై పవన్ కల్యాణ్ స్పందన
ఈ విషయంపై రామ్ చరణ్ బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోషల్ మీడియాలో స్పందించారు. “అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పోస్టు చేశారు. ఈ పోస్ట్ మెగా అభిమానుల్లో కొంత ధైర్యాన్ని అందించిందని చెప్పొచ్చు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
‘పెద్ది’ సినిమా రిలీజ్ వాయిదా?
గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో విశేష ఆదరణను రాబట్టుకుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మూవీ ఎప్పుడొచ్చినా రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లో ‘పెద్ది’ మరో మైలురాయిగా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On: Facebook

