నిజామాబాద్‌‌‌‌కు డబుల్ బెడ్రూమ్స్ కేటాయించరా.. గళమెత్తిన ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌కు ఒక్క డబుల్ బెడ్రూం కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana Gupta) విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూంపై మాట్లాడారు. ఇందూరు నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్రూంలు నిర్మించి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్లు తీసుకున్నారు, కానీ ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదన్నారు. వృథాగా ఉండటంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. అనేకసార్లు మంత్రులకు విన్నవించడంతో మరమ్మతుల కోసం 1.25 కోట్లు విడుదల చేశారని, కానీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు.

అనవసరంగా ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని, మరో 2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ దశల్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు మరో 3 కోట్లు కేటాయిస్తే సుమారుగా వేయి ఇళ్లు పూర్తవుతాయన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>