Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల: పోలింగ్‌ ఎప్పుడంటే?

కలం, వెబ్‌ డెస్క్ : దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల పరిధిలోని 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూన్, జూలై నెలల్లో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1వ తేదీన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లు సమర్పించడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థుల ఉపసంహరణకు జూన్ 11వ తేదీ వరకు సమయం ఇచ్చారు. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.

ఓటింగ్ విధానంలో పారదర్శకత కోసం ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఓటర్లు తమ ప్రాధాన్యతలను గుర్తించడానికి కేవలం రిటర్నింగ్ అధికారి సరఫరా చేసే ఇంటిగ్రేటెడ్ వయొలెట్ కలర్ స్కెచ్ పెన్నులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇతర పెన్నులు ఉపయోగిస్తే ఓట్లు చెల్లకుండా పోతాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఈసీ కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>