Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్ గురించి ప్రశ్న.. రజినీకాంత్ షాకింగ్ రియాక్షన్!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. తనదైన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టులో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను (Rajinikanth) కొందరు మీడియా ప్రతినిధులు.. సీఎం విజయ్ గురించి ఏం చెబుతారు అని ప్రశ్నించగా, నవ్వుతూ నమస్కారం పెట్టి వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందిన సందర్భంగా పోస్ట్ చేసిన రజినీకాంత్.. సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి అభినందన పోస్ట్ చేయలేదు.

ఇద్దరి మధ్య విబేధాలు..?

తమిళ సినిమాల్లో రజినీకాంత్, విజయ్ స్టార్‌డమ్ ఎవరిది వారికే ప్రత్యేకమైనా.. ఇరు వర్గాల ఫ్యాన్స్ ఎప్పుడూ ఉప్పు నిప్పుగానే ఉంటుంటాయి. తాజాగా, ఫలితాలు విడుదలయ్యాక.. రజినీకాంత్ వెళ్లి స్టాలిన్‌ను కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. పైకి ఇది మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా.. డీఎంకే–అన్నాడీఎంకే మధ్య రాజీ కుదిర్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావించి.. రజినీకాంత్‌ను మధ్యవర్తిగా పంపించిందనే ఊహాగానాలు వచ్చాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, రజినీ అడ్డుకున్నాడని ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>