కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, పలువురు మంత్రులతో కలిసి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సమస్యలు, వారి జీవన పరిస్థితులు, బాధల గురించి విన్నట్లు చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన డేటా, రికార్డులు అందుబాటులో ఉంటాయన్నారు.
కానీ, ప్రజల కోసం పనిచేసే గిగ్ వర్కర్లకు సంబంధించిన రికార్డులు ఉండవని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గిగ్ వర్కర్ల పాలసీ ద్వారా వర్కర్లకు సంబంధించి అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. కార్మికులకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. సమాజంల కోసం కష్టపడుతున్న గిగ్ వర్కర్లకు తగిన గుర్తింపు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గిగ్ వర్కర్‌కు పింఛన్ సౌకర్యం కల్పించాలని రాహుల్ (Rahul Gandhi) అభిప్రాయపడ్డారు.

