జైలు జీవితాన్ని చూడాలనుందా? : చంచల్‌గూడలో సరికొత్త అవకాశం!

కలం, వెబ్ డెస్క్‌ : చంచల్‌గూడ (Chanchalguda) సెంట్రల్ జైలు ప్రాంగణం సరికొత్త పర్యాటక అనుభవానికి వేదికగా మారింది. జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫీల్ ది జైల్ (Feel The Jail) కార్యక్రమంతో పాటు జైలు మ్యూజియంను గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఘనంగా ప్రారంభించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఖైదీల జీవనశైలిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ఈ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జైలు నిబంధనలు అలాగే అక్కడి వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఈ ఫీల్ ది జైల్ ద్వారా లభిస్తుంది. నేరాల పట్ల అవగాహన కల్పించడం విలువల ప్రాధాన్యతను చాటిచెప్పడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. అధికారులు ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>