Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్ విజయంపై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో దళపతి విజయ్ సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలుచుకుని తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే విజయ్ విజయంపై అందరూ ప్రశంసలు అందించగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మాత్రం స్పందించకపోవడంతో విజయ్ సీఎం అవ్వడం తలైవాకు ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై  రజనీకాంత్ స్పందించారు.

రజనీకాంత్ మాట్లాడుతూ.. విజయ్ సాధించిన విజయంపై నాకు ఎలాంటి అసూయ లేదు. కేంద్రంలోని బీజేపీతో పాటు తమిళనాడులోని ప్రధాన ద్రవిడ పార్టీలను ఎదుర్కొని స్వతంత్రంగా విజయం సాధించారని రజనీ పేర్కొన్నారు. ఈ విజయాన్ని తమిళ సినీ-రాజకీయ చరిత్రలో కీలక ఘట్టంగా అభివర్ణించారు. అంతేకాకుండా, ఇది ఎం. జి. రామచంద్రన్, ఎన్. టి. రామారావు సాధించిన రాజకీయ విజయాలకంటే పెద్దదని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో వారు  ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల కంటే విజయ్ ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులు ఎంతో కఠినమైనవని రజనీకాంత్ అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయ్ ఘన విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని రజనీకాంత్ తెలిపారు.

Read Also: రెండు రోజులలో రామ్ చరణ్‌కు మరో సర్జరీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>