రాజస్థాన్ ‘రాయల్’ ఇన్నింగ్స్.. చిత్తయిన చెన్నై

కలం, వెబ్ డెస్క్:  గౌహతీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ‘రాయల్’ ఇన్నింగ్స్ ఆడింది. చెన్నై ఇచ్చిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ 8 వికెట్లు మిగిలి ఉండగానే కేవలం 12.1 ఓవర్లలోనే ఊదిపారేసింది. వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసం సృష్టించాడు. 17 బంతుల్లో 52 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ నిలకడగా రాణించి మ్యాచ్ చివరి వరకు నిలిచాడు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు బాది, చెన్నై ఆశలను ఆదిలోనే సమాధి చేశాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్‌లు తగిలాయి. నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ వేసిన నిప్పులు చెరిగే బంతులకు స్టార్ బ్యాటర్లు క్యూ కట్టారు. సంజూ శాంసన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా, ఆయుష్ మత్ర్హే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) కాసేపు నిలబడినా, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి చిక్కారు. చివర్లో జామీ ఓవర్టన్ (36 బంతుల్లో 43, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడటంతో చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులైనా చేయగలిగింది. జామీ ఓవర్టన్ 43, కార్తీక్ శర్మ 18, సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, జడేజా, నాండ్రే బర్గర్ చెరి రెండు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశాడు.

128 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 52 పరుగులు బాది మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అతనికి జతగా యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వైభవ్ అవుట్ అయ్యాక ధ్రువ్ జురెల్ (18) మెరుపులు మెరిపించగా, చివర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ (14 నాటౌట్) సిక్సర్‌తో విజయ తీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీసినా, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాట్ హెన్రీ (13.33 ఎకానమీ), నూర్ అహ్మద్ (12.00 ఎకానమీ) ధారాళంగా పరుగులు ఇచ్చి రాజస్థాన్ విజయాన్ని సులభతరం చేశారు. వైభవ్ సూర్యవంశీ 52, యశస్వి జైస్వాల్ 38నాటౌట్, ధ్రువ్ జురెల్ 18, పరాగ్ 14 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో అన్షల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశాడు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>