సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ వరల్డ్ రేంజ్‌లో అంతా ఈ మూవీ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో పనులను కొనసాగిస్తోంది. మహేష్ బాబు స్టార్‌డమ్‌కు తగ్గట్లే మూవీని రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు మూవీ టీమ్ చెప్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మూవీ టీమ్ ఫోకస్ పెట్టింది. ఒక పేరును కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి టైటిల్‌ను ఎవరూ ఊహించి కూడా ఉండరు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా.. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్.. సింహంతో కొన్ని సీన్లు.. దాన్ని నిజం చేస్తూ వచ్చిన కొన్ని పోస్టర్లు.. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ సినిమా టైటిల్ గూస్‌బంప్స్ తెప్పిచేలా ఉంటుందని అనుకున్నారు.
ఎలా చూసుకున్నా ఈ మూవీ(SSMB29) చాలా స్పెషల్‌గా ఉంటుందనేది ఫ్యాన్స్ అంచనా. అలాంటి సినిమాకి టైటిల్ అంటే ఇంకెంత స్పెషల్‌గా ఉంటుంది. బాబు ఇమేజ్‌కి తగ్గట్టుగా టైటిల్ పవర్‌ఫుల్‌గా, క్యాచీగా ఉండేలా జక్కన్న చూసుకుంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ, హాలీవుడ్ లెవెల్లో చేస్తున్న ఈ సినిమాకు ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పెట్టుకున్న అంచనాలు ఏంటి పెట్టిన టైటిల్ ఏంటి? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే టైటిల్ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.

