తెలంగాణ జాగృతిలో చేరిన పలువురు నాయకులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతిలో గురువారం పలువురు నాయకులు చేరారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో వీరి చేరికలు జరిగాయి. సింగరేణి జాగృతి రాష్ట్ర నాయకుడు, మంచిర్యాల జిల్లా జాగృతి నాయకుడు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ప్రేమ్ రావు, దిలీప్ గౌడ్, రాజు గౌడ్, నారాయణ, వసంత, తిరుపతి, వెంకటేష్, రమేష్ తదితరులు కలిపి మొత్తం 57 మంది తెలంగాణ జాగృతిలో చేరారు. వీరికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు. అలాగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రాహుల్ యాదవ్ తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ కు కండువా కప్పి కవిత జాగృతిలోకి ఆహ్వానించారు.

తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఉపాధ్యక్షురాలు డా. మంచాల వరలక్ష్మి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డి. సౌజన్య, డి. శరత్ రెడ్డి తదితరులతో కూడిన 50 మంది సభ్యుల బృందం తెలంగాణ జాగృతిలో చేరారు. వీరికి కవిత కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు. జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాము యాదవ్, ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో సన్సిటీ, ఆల్వాల్ ప్రాంతానికి చెందిన యువకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి జాగృతిలోకి కవిత (Kavitha) ఆహ్వానించారు. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మాజీ కౌన్సిలర్ ప్రతిభా గౌడ్, పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్న తరుణంలో పలువురు నాయకులు జాగృతిలో చేరడం ఉత్సాహాన్ని ఇస్తుందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Read Also: సిద్దిపేట దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>