సీఎంకు రాజా సింగ్ లేఖ.. సజ్జనార్‌పై సీబీఐ విచారణకు డిమాండ్

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) సంచలన లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ (Sajjanar)పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. మాజీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ హయాంలో అవకతవకలపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. గోల్డ్ తెఫ్ట్ కేసులో ఎలాంటి పురోగతి లేదని.. ఈ కేసులో అరెస్టులు ఎందుకు జరగలేదు? అని ప్రశ్నించారు. హామ్ వే కేసులోనూ దర్యాప్తు నత్తనడకగానే ఉందని.. కేసు దర్యాప్తులో ఆలస్యానికి కారణం ఏంటి? అని నిలదీశారు. జనార్ధన్ పై ట్వీట్ తర్వాత సజ్జనార్ తీరుపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. సజ్జనార్ పై స్వతంత్ర సీబీఐ విచారణ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>