కలం, వెబ్ డెస్క్: కుల్గాం ఉగ్ర దాడి (Kulgam Terror Attack)కి ప్రణాళిక రూపొందించి, అమలు చేయించింది లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ నాయకుడు సజ్జద్ గుల్గా నిఘా వర్గాలు గుర్తించాయి. లతీఫ్ భట్ ద్వారా జమ్మూలో ఉగ్ర దాడులకు పాల్పడుతున్నాడని స్పష్టం చేస్తున్నాయి. లతీఫ్ భట్ తరచూ సజ్జద్ గుల్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా నిర్ధారించాయి. వీరి నెట్వర్క్పై నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. మరోవైపు.. సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి పారిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల కోసం ఇంకా భద్రత బలగాలు వెతుకుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత నిశ్శబ్ధంగా ఉన్న ఉగ్రవాదులు.. మళ్లీ దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

