దేవుళ్లపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు.. రాజా సింగ్ ఆగ్రహం

కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి తన రాజ్యాంగబద్ధమైన హోదాను గుర్తుంచుకుని మాట్లాడాలని, ఇటువంటి వ్యాఖ్యలు ఆయన పదవికి తగవని పేర్కొన్నారు. రాముడు, మహాదేవుడిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీయకుండా సీఎం సంయమనం పాటించాలని వారు కోరారు.

రేవంత్‌రెడ్డి రాజకీయంగా తన స్థాయిని పెంచుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడతాయని భావిస్తే అది పొరపాటేనని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని, ముఖ్యమంత్రి రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

శ్రీరామచంద్రుడు, మహాదేవుడు కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే దేవుళ్లని గుర్తు చేశారు. వారి విశ్వాసాలను రాజకీయ వివాదాలు, విభజనకు కారణంగా మార్చకూడదని సూచించారు. ముఖ్యమంత్రి ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ సంయమనం పాటించాలని, తన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల రేవంత్‌రెడ్డి రాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>