Mobile Popup Ad
Mobile Popup Ad

లిక్క‌ర్ కేసు.. రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డికి రిమాండ్

క‌లం, వెబ్ డెస్క్: ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నేడు ఉద‌యం ఈడీ అధికారులు ప‌లు చోట్ల త‌నిఖీలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసులో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి (Raj Kasireddy)ని, వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy)ని అరెస్ట్ చేశారు. ఈ ఇద్ద‌రికి సంబంధించిన ప‌లు ఇండ్లు, వ్యాపార సంస్థ‌లు, వారి బంధువుల ఇండ్ల‌ల్లో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఇక నేడు సాయంత్రం వాసుదేవ రెడ్డిని, రాజ్ కేసిరెడ్డిని పోలీసులు నాంప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. కోర్టు వీరిద్ద‌రికీ ఈ నెల 25 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>