నేడు లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న జితేంద్ర సింగ్

కలం, న్యూఢిల్లీ: కీలకమైన యాంటీ–పేపర్ లీక్ బిల్లు (Anti Paper Leak Bill) ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ (Jitendra Singh) ప్రవేశపెట్టనున్నారు. నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో పేపర్ లీకేజీల కట్టడికి కఠిన చట్టం తెస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నెల 24న కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

దీన్ని సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని అదే రోజు ప్రధాని వెల్లడించారు. మరోవైపు పేపర్ లీకేజీలపై మూడునెలల్లోపే విచారణను పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, మూడునెలల్లోనే దోషులను తేలుస్తామని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రం ప్రకటించింది.
బిల్లులో ఏముంది?

2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు (Anti Paper Leak Bill) తెస్తున్నది. పేపర్ లీకేజీలకు పాల్పడితే ప్రస్తుత చట్టం కింద మూడేండ్ల నుంచి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇప్పుడు కొత్త బిల్లులో పదేండ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానాగా సవరించారు.

Read Also: ఢిల్లీ లాఠీ చార్జ్‌పై చ‌ర్చించాల్సిందే.. సుర్జేవాలా వాయిదా తీర్మానం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>