కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు సుడా ఛైర్మన్ శంకుస్థాపన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) రూరల్ మండలం ముగ్దుంపూర్, బహదూర్‌ఖాన్‌పేట్‌లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పర్యటించారు. ముగ్దుంపూర్ మెయిన్ రోడ్డు ఆనుకొని రూ.5 లక్షలతో డ్రెయిన్ నిర్మాణానికి, బహదూర్‌ఖాన్‌పేట్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన చోట అభివృద్ధికి నిరంతరంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బహదూర్‌ఖాన్‌పేట్‌, దుబ్బపల్లి, చామనపల్లి, చర్లబుత్కూర్ సర్పంచులు గుర్రం తిరుపతి రెడ్డి, మోతే ప్రశాంత్ రెడ్డి, బోగొండ అయిలయ్య, కూర నరేష్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్ తప్పట్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేందర్, మొగ్దుంపూర్ గ్రామ వార్డ్ మెంబర్ మల్లారెడ్డితో పాటు సిరిగిరి రంగారావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>