RR vs RCB మ్యాచ్.. వరుణుడు కరుణిస్తాడా?

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్ది సేపట్లో అజేయ జట్లు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కీలక పోరు (RR vs RCB)కు వాతావరణం ఎంతవరకు సహకరిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గౌహతిలో ఈ సీజన్ ఆరంభం నుండి వర్షం అడపాదడపా అంతరాయం కలిగిస్తూనే ఉంది. గతంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ వాన వల్ల 11 ఓవర్లకు కుదించబడింది.

ఆ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. నేటి మ్యాచ్ (RR vs RCB) విషయానికి వస్తే, పగటిపూట 56 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే క్రికెట్ అభిమానులకు ఒక ఊరటనిచ్చే వార్త ఏమిటంటే, సాయంత్రం సమయానికి వర్షం పడే అవకాశం కేవలం 8 శాతానికి పడిపోనుంది.

దీని వల్ల 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కాకపోతే స్థానిక వాతావరణ మార్పుల వల్ల టాస్ పడటంలో ఆలస్యం లేదా ఆట మధ్యలో చిన్నపాటి బ్రేకులు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఇప్పటికే కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇలాగే రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్ రేసులో ప్రతి పాయింట్ కీలకమైనందున, పూర్తిస్థాయి మ్యాచ్ జరగాలని ఇరు జట్ల యాజమాన్యాలు కోరుకుంటున్నాయి. గౌహతి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>