కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. గాలి ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వేసవి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ వాన కాస్త ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.

