ప్రభాస్‌కు తల్లిగా నటించడం ఇష్టం లేదు : రాశి

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ అంటే హీరోయిన్లు రెడీగా ఉంటారు. ఇక సీనియర్ హీరోయిన్ లు అయితే ప్రభాస్ పక్కన ఏదో ఒక పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాల్లో నటించడంపై తాజాగా సీనియర్ హీరోయిన్ రాశి (Raasi) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా అనుమాన పక్షి సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ మూవీ ఈవెంట్ లో తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాలో నటించను అని తాను చెప్పినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ప్రభాస్ కు తల్లిగా నటించడం ఇష్టం లేదని చెప్పానని రాశి (Raasi) స్పష్టం చేశారు.

‘నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయనకు తల్లిగా నటించడం నాకు ఇష్టం లేదు. కానీ సిస్టర్ గా నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇప్పటి వరకు ప్రభాస్ తో నటించే ఛాన్స్ రాలేదు. నా కోరిక అలాగే ఉండిపోయింది. ఆ ఛాన్స్ త్వరలోనే రావాలని కోరుకుంటున్నా’ అని రాశి తెలిపారు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>