తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

కలం, వెబ్ డెస్క్: మండుతున్న ఎండల వేళ తెలంగాణ (Telangana)కు బిగ్ రిలీఫ్ దక్కింది. వాతవరణ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణా అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు (Rain Alert) కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ తో సహా పలు జిల్లాలకు వర్షం పడుతుందని తెలిపింది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.

ఇదిలాఉంటే మరికాసేపట్లో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని రుద్రారం, సదాశివపేట, పాశమైలారం, కంది, ఇస్నాపూర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. దీంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు.

Read Also: మనస్తాపంతో విద్యార్థిని సూసైడ్.. కేయూలో ఉద్రిక్తత.. అసలేమైందంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>