Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తృణముల్ కాంగ్రెస్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేయగా.. తాజాగా టీఎంసీ (TMC) కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీ 291 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి సంచలనం సృష్టించింది. టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా డెమెక్రటిక్ ఫ్రంట్‌కు మిగిలిన మూడు నియోజకవర్గాలను కేటాయించింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన కంచుకోట భవానిపూర్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇదే స్థానం నుంచి ప్రతిపక్ష నాయకుడు సుబేంధు అధికారి పోటీ చేయనున్నారు. టీఎంసీ జాబితాలో 52 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 95 స్థానాలను ఎస్సీ/ఎస్టీ వర్గాలకు కేటాయించారు.

భవానిపూర్ స్థానం నుంచి మమతా బెనర్జీ (Mamata Banerjee) నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థి పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. బెంగాల్ బీజేపీ కీలక నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి మమతా బెనర్జీతో ఎన్నికల బరిలో నిలువనున్నారు. భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా ఆయన పోటీ చేయనున్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. బెంగాల్ లో అధికారం పొందేందుకు అటు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Read Also: మార్చి 20న కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>