Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వసూలు.. నిందితుల అరెస్ట్

కలం, జనగామ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్రోల్ బంకులు మంజూరు చేయిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను జనగామ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడితో సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జనగామ (Jangaon) పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. జనగామకు చెందిన బెలిగిని శివకుమార్ వృత్తిరీత్యా పురోహితుడు. తన వద్దకు వచ్చే భక్తులతో మాటలు కలిపి, తనకు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, ఐపీఎస్ అధికారులతో (ముఖ్యంగా సజ్జనార్ వంటి వారితో) సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మించేవాడు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తనకు తెలుసని, వారి ద్వారా జెట్ స్పీడ్ తో ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని ఆశ చూపేవాడు. ఈ క్రమంలో శివకుమార్, తన అనుచరులైన కరీంనగర్ జిల్లాకు చెందిన ఇల్లందుల శ్రీనివాస్, ఆకవరం సాయి చరణ్, భూపాలపల్లికి చెందిన దరావత్ రాజేష్‌లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. వీరి మాయమాటలు నమ్మిన పలువురు బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బుతో ఈ నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

పోలీసులకు బాధితులు ఫిర్యాదు..

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జనగామ (Jangaon) పోలీసులు నిందితులపై నిఘా ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం హన్మకొండ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ (Indian Oil) పెట్రోల్ బంక్ సమీపంలో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, సబ్-ఇన్స్పెక్టర్ ఎం.భరత్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

అధికారుల ప్రశంసలు.. ప్రజలకు విజ్ఞప్తి

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. “ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి” అని కోరారు.

Read Also: టార్గెట్ త్రీ మంత్స్.. డ్రగ్స్ కేసుపై సిట్ ప్లాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>