Mobile Popup Ad
Mobile Popup Ad

మనస్తాపంతో విద్యార్థిని సూసైడ్.. కేయూలో ఉద్రిక్తత.. అసలేమైందంటే?

కలం, వెబ్ డెస్క్ : హన్మకొండ జిల్లా కాకతీయ యునివర్సిటీ (Kakatiya University) లో దారుణం జరిగింది. దొంగతనం చేసిందని కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20) కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలో (Kakatiya University) ని పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్‌లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో వివాదం చెలరేగింది. ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసింద‌ని ఆరోపిస్తూ శ్రీవిద్యపై ఈనెల 2న‌ వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వస్తువులకు సంబంధించి డబ్బు చెల్లించాలని శ్రీ‌విద్య త‌ల్లిదండ్రుల‌కు పోలీసుల స‌మాచారం అందించారు.

పోలీసుల విచారణ అనంత‌రం శ్రీవిద్యను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దుందిరాలపాడు గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి తల్లి అంజమ్మ తీసుకెళ్ళింది. ఈ క్రమంలోనే తీవ్ర మ‌న‌స్థాపంతో ఈనెల 7న ఎలుకలు మందు తాగి శ్రీవిద్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీడియో రికార్డ్ చేస్తూ.. తన‌పై స‌హ‌చ‌ర విద్యార్థులు దాడి చేశార‌ని తెలిపింది. విషయం తెలుసుకున్న కుటుంబికులు..హైద‌రాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా మధిర పీఎస్‌లో త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

విద్యార్థిని శ్రీ‌విద్య‌కు మ‌ద్ద‌తుగా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళ‌న‌ చేపట్టారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక శ్రీ‌విద్య ఆత్మహత్య చేసుకుందని సదరు విద్యార్థులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read Also: టార్గెట్ త్రీ మంత్స్.. డ్రగ్స్ కేసుపై సిట్ ప్లాన్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>