Mobile Popup Ad
Mobile Popup Ad

పారాక్వాట్‌ను నిషేధించండి.. ప్ర‌భుత్వాల‌కు యాక్ట‌ర్ రాహుల్ రిక్వెస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తన సోదరుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్నారు. పారాక్వాట్ (Paraquat) అనే ప్రమాదకరమైన గడ్డి మందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషపూరిత రసాయనం చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉందని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఇది ఆత్మహత్య చేసుకునే వాళ్లకు ఒక ముఖ్య సాధనంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పారాక్వాట్‌ను తక్షణమే నిషేధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధాన మంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు. పారాక్వాట్ విషానికి విరుగుడు లేకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని రాహుల్ పేర్కొన్నారు. పారాక్వాట్ సులభంగా అందుబాటులో ఉండకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీంతో పాటు పారాక్వాట్ వల్ల జరుగుతున్న అనర్థాలను వివరిస్తూ మరో లింక్‌ను రాహుల్ షేర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>