మద్దతు ధరకు తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: పౌరసరఫరాల అధికారి

కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో (Khammam) రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేసేటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ఏమాత్రం తగ్గకుండా చెల్లించాలని వ్యాపారులు, రైస్ మిల్లర్లను జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాల మేరకు సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాలకు చెందిన ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లతో సత్తుపల్లి మిల్ పాయింట్ వద్ద బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 2,481 తో పాటు, ప్రభుత్వం అందించే బోనస్ రూ. 500 కలిపి మొత్తం క్వింటాలుకు రూ. 2,981 చెల్లించాలన్నారు. అలాగే దొడ్డురకం ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,461 చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయరాదని, వీలైతే రైతులకు అండగా నిలుస్తూ మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ధాన్యం సేకరించాలని సూచించారు. ​

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రైతులను నష్టపరిచే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధర లేదా అంతకంటే ఎక్కువ చెల్లించే వ్యాపారులకే విక్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>