Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానం లేదు: మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్ బ్యూరో: త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీ.. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన నేతలు కాంగ్రెస్ నాయకులు అని టీపీసీసీ చీఫ్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ జరిగిన అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన జిల్లాలో మొదటగా భూమి పూజ జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయ్యాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నిజామాబాద్‌లో కులాలు, మతాల పేరిట బీజేపీ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు.

కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక కేసీఆర్ (KCR) సతమతమవుతున్నారని విమర్శించారు. కవిత పార్టీని స్వాగతిస్తున్నాం అని చెబుతూనే పదేళ్ల బీఆర్ఎస్ పాపపు పాలనలో ఆమె పాత్ర కూడా ఉందని వేలెత్తి చూపారు. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని, కానీ కేసీఆర్ 50 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తదని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని మహేశ్ కుమార్ గౌడ్  విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>