కలం, మునుగోడు : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీం వర్క్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చౌటుప్పల్‌ను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయగలమని అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా హాజరైన ఆయన, వెనుకబడిన వార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధి కాంక్షతో పనులు ప్రారంభించాలని సూచించారు.
ఈ ఎన్నికల ప్రక్రియలో 12 మంది హాజరై, కోరం పూర్తి చేయడంలో సహకరించారు. 50+1 సభ్యుల ఆమోదంతో ఎన్నికల ప్రక్రియ సాగింది. తరువాత, కమిషనర్ గుప్త వెంకటరామిరెడ్డి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పర్సన్ గంగారం, సందగళ్ల విజయ సతీష్, బాబా షరీఫ్, షేక్ నబీబీ జానీ బాబాల చేత ప్రమాణం చేయించారు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అభివృద్ధి విషయంలో నాతో ఎప్పటికప్పుడు చర్చించవచ్చని, పూర్తిగా వెనుకబడిన వార్డులకు ప్రాముఖ్యతనిస్తూ అభివృద్ధి చేసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తెలిపారు.

