ఎంపీలతో రాహుల్ సమావేశం.. ఏం చేయబోతున్నారు?

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరికాసేపట్లో పార్టీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. నీట్ లీకేజీ సహా పలు అంశాలపై గత మూడు రోజులుగా నిరవధికంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ సమావేశం నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దేశ వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం..?

కేంద్ర విద్యా శాఖ ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను అందిపుచ్చుకుని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూనే.. కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలో రాహుల్ (Rahul Gandhi) ఎంపీలకు వివరించే అవకాశం ఉంది.

Read Also: భారత్‌ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>