కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా లేదని, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై స్పష్టమైన పద్దులు లేకపోవడాన్ని తప్పుబట్టారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా బడ్జెట్ రూపొందించారని, సామాన్యులపై ఆర్థిక భారం పెరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget)పై ఎక్స్ వేదికగా స్పందించారు. తయారీ రంగం పడిపోతోందని, యువతకు ఉద్యోగాలు లేవని మండిపడ్డారు. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. గృహ పొదుపులు వేగంగా తగ్గుతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వాస్తవ సంక్షోభాలను పట్టించుకోకుండా సంస్కరణలను అందించడానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Read Also: బడ్జెట్‌లో ఆయుర్వేదానికి ప్రాధాన్యం
Follow Us On: Sharechat


