అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్

కలం, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Commissionerate) పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. సీసీఎస్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర వాహన దొంగలను (Interstate Bike Theft Gang) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన 28 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడించారు.

సాంకేతిక ఆధారాలతో చేపట్టిన దర్యాప్తులో నిందితులు వరంగల్, కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లతో పాటు భూపాలపల్లి జిల్లాలో మొత్తం 28 బైక్ చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం వాటిని అసలు యజమానులకు అప్పగిస్తామని వెల్లడించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన సీసీఎస్, కేయూసీ పోలీసు బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>