ప్రజల వినతులపై వెంటనే స్పందించాలి : ఎస్పీ జానకి

కలం , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి (Mahabubnagar SP)  ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ శ్రద్ధగా విని, సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల స్వరూపాన్ని తెలుసుకొని, చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి, చట్టబద్ధమైన విధానంలో న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>