బిల్లు ఆమోదం పొంద‌ద‌ని బీజేపీకి తెలుసు: రాహుల్ గాంధీ

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్‌స‌భ‌లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళా బిల్లుపై విప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ బిల్లు ఎట్టిప‌రిస్థితుల్లో ఆమోదం పొంద‌ద‌ని వ్యాఖ్యానించారు. ఆ విష‌యం బీజేపీకి కూడా తెలుసున‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ బిల్లును వ్య‌తిరేకిస్తార‌ని వారికి ముందే తెలుస‌న్నారు. ప్ర‌ధాని కేవ‌లం ఇండియా ఎల‌క్టోర‌ల్ మ్యాప్‌ను చేంజ్ చేసేందుకే ఈ బిల్లుపై మాట్లాడుతున్నార‌ని చెప్పారు. స‌మాజంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని, మ‌న జీవితంలో త‌ల్లులు, అక్కాచెళ్లెళ్లు, భార్య‌ల నుంచి ఎంతో ప్ర‌భావితం అవుతామ‌ని చెప్పారు. ఇక త‌న‌కూ, మోడీకి భార్య స‌మ‌స్య లేద‌ని రాహుల్ ఫ‌న్నీ కామెంట్స్ చేశారు. గురువారం ప్రియాంకా గాంధీ స‌భ‌లో చేసిన ప్ర‌సంగంపై రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను 20 ఏళ్లలో చేయలేని పనిని త‌న‌ సోదరి ప్రియాంక ఐదు నిమిషాల్లో చేసి చూపించింద‌న్నారు. ప్రియాంక ప్రసంగం విని చాలా గర్వపడ్డానని, ఆమె హోంమంత్రి అమిత్ షాను నవ్వించారని వెల్లడించారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో ఉన్న వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

స‌భ‌లో ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ ఒక మేజిషియ‌న్ అని వ్యాఖ్యానించారు. మేజిషియ‌న్‌, బిజినెస్ మ్యాన్‌కు మ‌ధ్య ఒక పార్ట్‌న‌ర్ షిప్ ఉంద‌న్న సంగ‌తి ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు. ఈ పార్ట్‌న‌ర్ షిప్‌లో ఒక బ‌ల‌మైన ప‌వ‌ర్ ఉంద‌న్నారు. ఇది చాలా శ‌క్తివంత‌మైన‌ది కానీ, పూర్తిగా బ‌య‌ట‌కు క‌నిపించ‌ద‌న్నారు. తాను చెప్తున్న మేజిషియ‌న్ చ‌రిత్ర ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పీక‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ ప‌ద్ధ‌తి స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. అయితే త‌న వ్యాఖ్య‌ల్లో ప్ర‌ధాని పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేద‌ని రాహుల్ అన్నారు. స‌భ‌ను గౌర‌వించాల‌ని, స‌భ‌లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని స్పీక‌ర్ సూచించారు. మ‌రోవైపు రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) సీరియస్ అయ్యారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిప‌డ్డారు. ఇది ప్ర‌ధానితో పాటు దేశ ప్ర‌జ‌ల‌ను కూడా అవమానించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read Also: రేవంత్ రెడ్డి ఉద్య‌మ‌కారుల్ని చంపాల‌నుకున్నాడు: బండి సంజ‌య్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>