Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డి ఉద్య‌మ‌కారుల్ని చంపాల‌నుకున్నాడు: బండి సంజ‌య్

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీడీపీలో ఉన్నాడ‌ని, అప్పుడు ఉద్య‌మ‌కారుల్ని చంపాల‌ని అనుకున్నాడ‌ని ఆరోపించారు. అందుకే క‌రీంన‌గ‌ర్‌లో ర‌ణ‌భేరి స‌భ‌కు తుపాకీ తీసుకొని వెళ్లాడ‌ని చెప్పారు. బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై బండి సంజ‌య్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎవ‌రి కేబినెట్‌లో ప‌ని చేస్తున్నార‌ని బండి ప్ర‌శ్నించారు? సోనియా గాంధీ (Sonia Gandhi) బ‌లిదేవ‌త అని, ఆమె చేసిన నీచ‌పు ప‌నుల వ‌ల్ల‌నే వెయ్యి మంది చనిపోయార‌ని నాడు రేవంత్ రెడ్డి అన్నార‌ని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను చూపించారు.

కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని తిట్టిన రేవంత్ కేబినెట్‌లో మీరు మంత్రులుగా ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించారు. తేజ‌స్వీ తెలంగాణ ఉద్య‌మ‌కారుల్ని దేశ భ‌క్తుల‌తో పోల్చిన విధానాన్ని కాంగ్రెస్ నేత‌లు వ‌క్రీక‌రిస్తూ బీజేపీపై వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించిన వ్య‌క్తి మీ పార్టీ నాయ‌కుడ‌ని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి విమ‌ర్శించారు. నాడు ఉద్య‌మ‌కారుల్ని చంపాల‌నుకున్న రేవంత్ రెడ్డి విధానంపై కాంగ్రెస్ నాయ‌కులు స‌మాధానం చెప్పాల‌ని బండి (Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Read Also: రోహిత్ వేముల చట్టం రూపకల్పన.. క్యాబినెట్ సబ్ కమిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>