కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో (Telangana) బాలకార్మిక వ్యవస్థ నేటికీ సవాలుగా మారుతోంది. తాజా నివేదికల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 89,000 మంది బాలకార్మికులు (Child Labour) ఉన్నట్లు సమాచారం. వీరంతా చదువుకు దూరమై వివిధ రకాల పనుల్లో మగ్గిపోతున్నారు. ప్రధానంగా వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర ప్రమాదకర పనుల్లో వీరిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 89,000 మందిలో అత్యధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఉండటం గమనార్హం.
ఆర్థిక అసమానతలు, పేదరికం, సరైన విద్యావకాశాలు లేకపోవడం వల్ల ఈ సామాజిక వర్గాల పిల్లలు చిన్న వయసులోనే పనిలోకి వెళ్లాల్సి వస్తోంది. ఇది వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, సామాజిక అసమానతలను మరింత పెంచుతోంది. బాలకార్మిక వ్యవస్థను (Child Labour) నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కేవలం చట్టాలు చేయడం ద్వారానే కాకుండా పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం, వారిని విద్యాసంస్థల్లో కొనసాగేలా చూడటం ప్రస్తుతం అత్యవసర అంశం.
Read Also: రేవంత్ రెడ్డి ఉద్యమకారుల్ని చంపాలనుకున్నాడు: బండి సంజయ్
Follow Us On: Instagram

