జ్ఞానేష్ కుమార్‌కు ఎందుకు భయం?: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: ప్రజలు ఎన్నుకున్న 300 మంది ఎంపీలు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలవాలని భావిస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఆయన ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన సమస్యేంటో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే పోలీసులు తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను అడ్డుకునే హక్కు వారికి ఎక్కడిదన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని.. ఎంపీలను కలవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్లు అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలను పట్టించుకోం..

బీజేపీ నాయకులను తాము లెక్కచేయమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వాళ్లు ఏమనుకుంటున్నారో నాకు అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 300 మంది ఎంపీలతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేష్ కుమార్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని దేశమంతా అంగీకరిస్తోంది. యువత, పోలీసులకు కూడా అర్థమైంది. ఓట్ చోరీ చేస్తూ మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్ దేశాన్ని హైజాక్‌ చేస్తున్నారు. వారికి జ్ఞానేష్ కుమార్ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. కచ్చితంగా వారిపై భబిష్యత్తులో చర్యలు ఉంటాయి. ప్రస్తుతానికి దేశాన్ని మోసం చేస్తున్న తీరు నుంచి బాధ్యులెవరూ తప్పించుకోలేరని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>