కలం, నిర్మల్ రూరల్: గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 6 ప్రకారం నెలకు రూ.18,500 వేతనం చెల్లించాలని సీఐటీయూ (CITU) గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు క్లైమెట్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ (Kondapur) గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికుల మండలస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా వెస్లీ మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మల్టీపర్పస్ విధానం, జీవో నంబర్ 51ను రద్దు చేయాలని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నిర్మల్ రూరల్ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయన్న, కార్యదర్శిగా నర్సయ్య, కోశాధికారిగా ముత్యం, 15 మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.

