మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, కడెం: నిర్మల్ (Nirmal) జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ (MLA Bojju Patel) మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఖానాపూర్ మండలం కొత్తపేట, బావాపూర్ (కే), గోసంపల్లి గ్రామాల్లో మహిళా సమైక్య (వీఓ) భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.

మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామీణ మహిళలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>