కలం, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా వరుస ధర్నా కార్యక్రమాలతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కుతోంది. నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై విద్యార్థి, విపక్ష సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ నిరసనల హోరును మరింత పెంచింది. ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశంలో ఇంత నిర్వాకం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనంలో వ్యవహరించడంలేదని, బాధ్యతా రాహిత్యానికి వారిద్దరూ రిజైన్ చేయాలని పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్ళారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వయసును లెక్కచేయకుండా మోదీ నివాసం దగ్గర రోడ్డుపై ధర్నాలో స్వయంగా పాల్గొన్నారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీ, నీట్ బాధితులకు న్యాయం చేయాలన్నారు. దేశంలోని యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రధాని మోదీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also: విచిత్ర ఘటన.. శివలింగంపై పోసిన నూనె పాలుగా మార్పు..!
Follow Us On: Instagram

